లక్ష్మణచాంద: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్ష్మణచాందలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ సుమలత తెలిపిన వివరాల ప్రకారం పవార్ రమేశ్ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. గత 15వ తేదీన బాగా మద్యం తాగి ఇంటికి రాగా అతని భార్య జ్యోతి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుమందు తాగారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி