ఓలా గ్రామంలో భారీ అగ్నిప్రమాదం

అగ్ని ప్రమాదంలో వడ్రంగి దుకాణం దగ్ధమైన ఘటన కుంటాల మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు. మండలంలోని ఓలా గ్రామంలో వేల్పూర్ రాజశేఖర్, రంజిత్, రాకేశ్కు చెందిన వడ్రంగి దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వడ్రంగి మిషన్, పరికరాలు సుమారు రూ. 30 నుంచి 40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி