కుబీర్ మండలం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ దావు (56) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. దావు భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో నిజామాబాద్ ఆసుపత్రిలో రెండు రోజులుగా ఉన్నాడు. కాగా, గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దావు మృతి పట్ల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.