దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గోండుగూడెం గ్రామానికి చెందిన పుర్క జగన్ (45) మంగళవారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆర్థిక ఇబ్బందలు తాళలేక తన నివాసంలో గుర్తు తెలియని పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.