చెన్నూరు: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

మంగళవారం చెన్నూర్ మండలంలోని అక్కేపల్లిలో విద్యుదాఘాతంతో కొర్తే సుధాకర్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో పూజ గదిలో వెలిగించిన దీపాన్ని ఎలుకలు కింద పడేయడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు విపరీతంగా వ్యాప్తి చెందడంతో ఇంట్లో ఉన్న బియ్యం, ఫర్నిచర్, ఇతర సామాగ్రి కాలిపోయింది. చెన్నూరులోని అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

தொடர்புடைய செய்தி