బాసర: ఆలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద గల కోటి గాజుల మండపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత కొద్దిరోజులుగా ఆలయం వద్ద యాచకుడిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న బాసర ఎస్ఐ గణేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఎవరికైనా అచికి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி