నిజామాబాద్ జిల్లా బోయగల్లికి చెందిన కోమటి గంగప్రసాద్ తన ఇద్దరి చిన్నారులతో కలిసి బుధవారం బాసర గోదావరి నదిలో దూకేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్ గమనించి వారి వద్దకు హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం వారిని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఏవైనా సమస్యలుంటే బంధువులతో చర్చించి పరిష్కరించుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు.