బాసర: ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి యువకుడు మృతి

ప్రమాద వశాత్తు బాసర గోదావరి నదిలో మునిగి సోమవారం యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం రత్నల్లి గ్రామానికి చెందిన పవార్ బాలాజీ అనే యువకుడు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలుజారి నీటిలో పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி