శ్రీరాంపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

హన్మకొండ జిల్లా నల్ల గట్టుగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీరాంపూర్ కు చెందిన ఉదయ్ (18) మృతి చెందినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. హన్మకొండ లోని ఓ కళాశాలలో చదువుతున్న ఉదయ్ అదే కాలేజీకి చెందిన మరో యువతితో కలిసి బైక్ పై వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி