చత్తీస్గడ్ లోని అమృత జలపాతం లో పడి నస్పూర్ కు చెందిన దురిశెట్టి పృథ్వీరాజ్ (32) మృతి చెందాడు. చతిస్గడ్ సౌత్ ఈస్టర్ కోల్ ఫీల్డ్ లో అండర్ మేనేజర్ గా పని చేస్తున్న పృథ్వీరాజు తోటి అధికారులతో కలిసి పిక్నిక్ కి వెళ్ళాడు. పృథ్వీరాజ్ తో పాటు మరో వ్యక్తి జలపాతం లోకి గల్లంతయి మృతి చెందాడు అతడికి కూతురు ఉండగా ప్రస్తుతం భార్య ఐదు నెలల గర్భవతి. పృథ్వీరాజ్ శవం గురువారం రాత్రి దస్పూర్ కు చేరుకుంది.