మంచిర్యాల: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వేమనపల్లి మండలం గొర్లపల్లి కొత్తకాలనికి చెందిన నీకాడి నాగేష్(25)విద్యుత్ శాఖలో కాంటాక్ట్ హెల్పర్ గా పని చేస్తున్నాడు. తనకు ఎవరు పిల్లను ఇవ్వడం లేదని తరచూ బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయ్యాడు మద్యం మత్తులో గత నెలలో పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజిఎం లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపారు.

தொடர்புடைய செய்தி