బెల్లంపల్లి పట్టణంలో బుధవారం రాత్రి కురిసిన వాన బీభత్సం సృష్టించింది. మెయిన్ బజార్ కల్పన సెంటర్ సమీపంలో భవనంపై ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ గాలివానకు ఒక్కసారిగా కిందికి వంగింది. పూర్తిగా కింద పడిపోకుండా పైనే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ఆ లైన్ గుండా వెళ్లే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. శివాలయం వద్ద ఓ భారీ చెట్టు విద్యుత్ తీగలపై పడిపోయింది.