ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామం వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ దస్తురాబాద్లో ఓ రిటైర్మెంట్ ఫంక్షన్కు బైకుపై వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి ఓ యాచకుడిని ఢీకొట్టగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.