రోడ్డుపైకి వచ్చిన వన్యప్రాణి చుక్కల దుప్పిపై గురువారం కుక్కలు దాడి చేశాయి. గమనించిన ఖానాపూర్ పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు కుక్కలను తరిమికొట్టి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చుక్కల దుప్పిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.