ఖానాపూర్ పట్టణంలో కోతులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో శ్రీజు అనే బాలుడిపై కోతులు దాడి చేసి గాయపర్చాయి. చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.