కడెం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

కడెం మండలం నర్సాపూర్ గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ నుంచి కడెం వైపు వస్తున్న కారును బైక్ ఢీకొన్న ఘటనలో కొత్త మైసంపేట్ గ్రామానికి చెందిన గాదె హరీశ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఖానాపూర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி