కడెం మండలంలోని పెద్దూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తాళాలను మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి చోరీకి యత్నించారు. బుధవారం ఉదయం పాఠశాల అటెండర్ పాఠశాలకు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే ప్రధానోపాధ్యాయుడు భూమేశ్వర్ కు సమాచారం అందించారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలలో ఎలాంటి రికార్డులు, సామగ్రి పోలేదని తెలిపారు.