మంచిర్యాల: గోదావరిలో గల్లంతయిన ఇద్దరి మృతదేహాలు లభ్యం

చెన్నూరు మండలం సుందరశాల గ్రామానికి చెందిన దాసరి సాయి, అరుణ్ అనే విద్యార్థులు శుక్రవారం గోదావరిలో గల్లంతయిన విషయం విదితమే. వారి స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు ఘటన స్థలికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో 6 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி