జైపూర్ మండలంలోని కుందారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు నీలగిరి ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మంగళవారం తెలిపారు. కుందారం అటవీ ప్రాంతంలో పులి తిరుగుతోందని జైపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆరేపల్లి ఘటం మీదుగా కుందారం వరకు అటవీ మార్గంలో ఎవరు వెళ్ళవద్దని సూచించారు. పంట పొలాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.