చెన్నూర్ పట్టణంలోని సమీకృత మార్కెట్ సముదాయ భవనంలో గురువారం ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. చెన్నూర్ మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన మారగోని అజయ్(14) అనుమానస్పద మృతి చెందాడు. చెన్నూర్ పట్టణంలోని మైనారిటీ హాస్టల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.