గుడిహత్నూర్ మండల కేంద్రంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఇచ్చోడ వైపు నుంచి ఆదిలాబాద్ వెళుతున్న రెండు లారీలు సైడ్ తీసుకొనే క్రమంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న మరో కంటైనర్ లారిని వెనుక నుండి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ క్యాబిన్లో చిక్కుకోగా స్థానికులు బయట తీశారు. తరచుగా లారీలు జాతీయ రహదారిపై నిలిపివేయడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.