యువకుడు ఆత్మహత్యాయత్నం

గుడిహత్నూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని మార్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యకి యత్నించ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி