కాసిపేట: భర్త అనారోగ్యం.. అప్పుల బాధతో వివాహిత ఆత్మహత్య

కాసిపేట మండలంలో కేంద్రానికి చెందిన దుర్గం రమ్య (27) అప్పుల బాధ, భర్త అనారోగ్యంతో మనస్థాపం చెంది ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భర్త రాజమల్లుకు పక్షవాతం వచ్చింది. దీంతో రమ్య కూలి పని చేస్తూ కొంత అప్పుచేసి చికిత్స చేయించింది. ఈ క్రమంలో భర్త అనారోగ్యంతో పాటు అప్పుల బాధని భరించలేక రమ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி