కొమురంభీం జిల్లాలో మద్యం దుకాణాలు బంద్

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాల్లో మంగళవారం నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలకు అబ్కారీ అధికారులు సీల్ వేశారు. దీంతో 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி