ఆసిఫాబాద్: సోలార్ విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి

సొలార్ విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో చోటు చేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పల్ నవేగాంకి చెందిన నీకోరె బాపూజీ శనివారం రాత్రి తన అన్న ఎడ్లు ఇంటికి రాకపోవడంతో వెతకడానికి వెళ్లాడు. తెల్లవారినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. కాగా ఆదివారం రాథోడ్ వివేక్ పొలం పక్కనున్న కెనాల్లో సొలార్ తీగలకు తగిలి మృతిచెంది కనిపించాడు.

தொடர்புடைய செய்தி