ఆసిఫాబాద్‌: మహిళల రక్షణపై పోలీసుశాఖ మరో ముందడుగు

ఆసిఫాబాద్‌: మహిళల రక్షణపై పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. జిల్లాలోని మొత్తం ఆటోల వివరాలు సేకరించి ప్రత్యేక డేటాబేస్‌ రూపొందించింది. జైనూర్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై ఆటోడ్రైవర్‌ దాడిచేసి గాయపర్చిన ఘటన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళలకు భరోసా కల్పించేలా పోలీసు విభాగం సన్నద్ధమైంది. మహిళలు, యువతులపై దాడులను అరికట్టేందుకు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

தொடர்புடைய செய்தி