విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు ఉద్యోగిని

యూపీలోని లక్నోలో ఓ బ్యాంకు ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గోమతినగర్‌లోని స్థానిక HDFC బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సదాఫ్‌ ఫాతిమా రోజు మాదిరిగానే మంగళవారం ఆఫీసుకు వచ్చారు. విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలారు. తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

தொடர்புடைய செய்தி