రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC)లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విభాగాలకు సంబంధించి మొత్తం 5,165 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. గ్రాడ్యుయేట్ విభాగంలో 3,477 పోస్టులకు అక్టోబర్ 8, 2026 నుంచి నవంబర్ 6, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 1,688 పోస్టులకు అక్టోబర్ 15, 2026 నుంచి నవంబర్ 13, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యాక ఖాళీలు, దరఖాస్తు ఫీజు, వయోపరిమితి సడలింపులు, ఎంపిక విధానం వంటి వివరాలు స్పష్టమవుతాయి.