సీఎం రేవంత్ రెడ్డి కోసం 350 కి.మీ పాదయాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయన్న అనే వ్యక్తి సుమారు 9 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హైదరాబాద్ చేరుకుని, ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిమానిని చూడగానే సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి, శాలువాతో సత్కరించి అతని బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி

✕
✕