2030 నాటికి 35 కోట్ల కొత్త కొలువులు!

దేశంలో 2030 నాటికి సుమారు 35 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు ఇండియా డిడాక్టిక్స్ అసోసియేషన్ వెల్లడించింది. తయారీ, సేవల రంగాలలో ఈ ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ భారీ ఉపాధి కల్పన లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడం అత్యంత అవసరమని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత మారుతున్న ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

தொடர்புடைய செய்தி

✕
✕