ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో 3,047 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 29న ప్రారంభం కాగా, నవంబర్ 20 వరకు గడువు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ongcindia.com వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.