కనకాంబరం కిలో రూ.2వేలు

దసరా పండగంటే పదిరోజుల వేడుక. దీంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. శరన్నవరాత్రి నేపథ్యంలో ప్రస్తుతం పూలధరలు ఒకేసారి పెంచేశారు. మార్కెట్‌లో పూల ధరలు ఆకాశాన్నంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కనకాంబరం పూల దిగుబడి తగ్గి, మార్కెట్‌కు తక్కువగా వచ్చాయి. దీంతో ధర కిలో రూ.1800 నుంచి రూ.2వేలకు పెరిగింది. మల్లెపూలు రూ.1000 నుంచి రూ.1200దాకా పలుకుతున్నాయి. చామంతి రూ.200 నుంచి రూ.300దాకా పలుకుతున్నాయి.

தொடர்புடைய செய்தி