అనంతపురం జిల్లాలో 6,770, శ్రీ సత్యసాయి జిల్లాలో 7,660 క్వింటాళ్లు కే-6, టీసీజీఎస్-1694, కదిరి లేపాక్షి-1812 రకం విత్తన వేరుశనగ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 15వ తేదీ నుంచి 40% రాయితీతో రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ఈ నెల 10వ తేదీ నుంచి స్థానిక RBKల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.