నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జిల్లాకు అధిక కేటాయింపులు ఉంటాయని ప్రజలు ఎంతో ఆశాభావంతో ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో జిల్లావాసులు కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు.