నేడు మన్యం జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ రాక

మన్యం జిల్లాలో రెండు రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ వి. కరుణ, రాష్ట్రస్థాయి జాయింట్‌ డైరెక్టర్లు పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో మన్యంలో పలు పీహెచ్‌సీలు, ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్రాసుపత్రి, సాలూరు, సీతంపేట, పాలకొండ ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలను సందర్శించనున్నారు. ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మందులు, పరికరాలు, సిబ్బంది సమర్ధత వంటి అంశాలను పరిశీలిస్తారు.

தொடர்புடைய செய்தி