రోడ్లపై అడ్డంగా వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవు: కమిషనర్

పొన్నూరు మున్సిపల్ కమిషనర్ శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న వీధి వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై అడ్డంగా వ్యాపారాలు చేసి ట్రాఫిక్ కు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అన్న క్యాంటీన్ ను సందర్శించి భోజనం రుచి, నాణ్యత పై భోజనం చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సచివాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி