సమస్యల పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతాం

ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగుతామని పల్నాడు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిబాబా రాజు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్యశ్రీ సిబ్బంది జీవితాల్లో మార్పు రావడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదన్నారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకాన్ని ఇన్సురెన్స్ విధానంలోకి మార్పు చేసినా పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి న్యాయం జరగడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி