మానవ చరిత్ర ఉన్నంతకాలం మరిచిపోలేని నిత్య స్మరణీయులని వాల్మీకి మహర్షి అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి రామాయణ మహాకావ్యం రూపంలో ఇంటింటా ఆయనను స్మరించుకుంటామని అన్నారు. గురువారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.