నేడు రాజంపేటలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించి, కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

தொடர்புடைய செய்தி