ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలోని అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిరుపతి జిల్లాల్లో ఆదివారం ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி

✕
✕