పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు

AP: కడప జిల్లా, పులివెందులలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసుల పహారా పెంచడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. నామినేషన్ల దాఖలుకు ఇదే చివరి రోజు కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఇప్పటికే నిన్న నోటీసులు జారీ చేయడం గమనార్హం. శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி

✕
✕