నేడు వైసీపీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

AP: వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో ఆదివారం విచారణ జరగనుంది. జిల్లాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ ఈ పిటిషన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు కల్పిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ ఈ అంశంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

தொடர்புடைய செய்தி

✕
✕