AP: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో నెలకొన్న బర్డ్ ఫ్లూ భయాన్ని దూరం చేసేందుకు పౌల్ట్రీ ఫెడరేషన్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గుంటూరులో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన చికెన్ ఫుడ్ మేళాలో చికెన్ వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఇబ్బంది లేదని చెప్పేందుకే ఈ చికెన్ ఫుడ్ మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.