ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌.. వారికే అవకాశం!

ఏపీలో నామినేటెడ్ పదవుల కేటాయింపుపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే టీడీపీ 47 మార్కెట్ కమిటీ ఛైర్మన్లను ప్రకటించగా.. మరిన్ని పదవులు ఎవరికీ ఇస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు MLAల అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర పార్టీలు వచ్చిన వారికంటే..TDPతో ఉండి, పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళకే పదవులు ఇచ్చేలాగా MLAలు పేర్లు పంపించాలని చెప్పినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி