ఏపీలో కరువు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 53.4 శాతం వర్షపాతం లోటు నమోదైంది. దీంతో 21 జిల్లాల్లో 388 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో 283 మండలాలు తీవ్ర, 105 మండలాలు సాధారణ కరువు పరిధిలో ఉన్నాయి. సెప్టెంబరు 16 వరకు 490.94 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా.. 244.69 మి.మీ. మాత్రమే నమోదైంది. ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు తగ్గాయి. దీంతో పంటలు ఎండిపోతుండగా.. భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయి.