AP: ఉప్పాడ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా అభిమానులు 'OG', 'OG' అని అరిచారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. "సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా వేయలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. ప్రజాసేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పా. OG బాగుంటుంది.. చూడండి." అని పవన్ పేర్కొన్నారు.