వినుకొండలోని కారంపూడి రోడ్డు వెన్నెల సూపర్ మార్కెట్ వద్ద ఆర్ అండ్ బి రోడ్ల పనులను మంగళవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ ఐదేళ్ల అసమర్ధ పాలనలో అభివృద్ధిని మరిచి రోడ్లపై తట్ట మట్టి కూడా వేసిన పాపాన పోలేదని విమర్శించారు. రోడ్లు అధ్వానంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆరోపించారు.