తెనాలి: దాడి చేసిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి

తెనాలిలో రౌడీ షీటర్ దాడి ఘటనలో గాయపడిన ఇంద్రజిత్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం రాత్రి తెనాలి హాస్పిటల్ లో పరామర్శించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తెనాలిలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు.

தொடர்புடைய செய்தி