ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు హెచ్చరించారు. తెనాలిలో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నిబంధనకు విరుద్ధంగా ఆటోలో ఎక్కువ మందిని ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఆటోలలో వెనుక వైపు డోరు ఓపెన్ చేసి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. ఆటోకి సంబంధించిన ధ్రువపత్రాలను డ్రైవర్లు తమ వెంటే ఉంచుకోవాలని సూచించారు.