సహనాను ఆసుపత్రిలో చేర్చిన నిందితుడు దృశ్యాలు

తెనాలి యువతి సహానాను నిందితుడు నవీన్ ఆస్పత్రిలో చేర్చిన సీసీటీవీ దృశ్యాలు బయటకి వచ్చాయి. అపస్మారక స్థితిలో ఉన్న సహనాను నవీన్ తన కారులో నుంచి దించి తెనాలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లోకి తీసుకెళ్లాడు. అయితే ఆ వైద్యశాలలో డాక్టర్లు లేరని చెప్పటంతో ఆ పక్కనే ఉన్న మరో ఆసుపత్రికి నవీన్ ఆమెను మోసుకుంటూ తీసుకెళ్లాడు. వైద్యులు సహనాను పరీక్షించి ఆరోగ్య విషమంగా ఉందని చెప్పడంతో నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు.

தொடர்புடைய செய்தி